ఎమ్మెల్యే ప్రచారాన్ని అడ్డుకున్న గ్రామస్తులు

Villagers fires on MLA Rega kantharao in his election campaign

భద్రాద్రి కొత్తగూడెం:  ఫిరాయింపు నేతలపై ప్రజలు విరుచుకుపడుతున్నారు. శనివారం ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ పై ఖమ్మం జిల్లా గొవింద్రాల ప్రజలు దాడి చేయగా.. ఈ రోజు పినపాక ఎమ్మెల్యే రేగాకాంతారావు పై రెడ్డి పాలెం గ్రామస్తులు విరుచుకుపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలం రెడ్డిపాలెంలో  ZPTC ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేగాను ప్రజలు అడ్డుకున్నారు. పార్టీ ఎందుకు మారారంటూ నిలదీశారు.

కాంగ్రెస్ నుంచి గెలిచి.. టీఆర్ఎస్‌లోకి వెళ్లడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ… కాంగ్రెస్‌  ఎమ్మెల్యేగా ఎన్నికై టీఆర్ఎస్‌కు మద్దతుగా ఎలా ప్రచారం చేస్తారంటూ నిలదీశారు. తమని మోసం చేసారని,ఏ మొహం పెట్టుకొని తమ ప్రాంతం వచ్చారని రేగా తో వాగ్వివాదానికి దిగారు గ్రామ ప్రజలు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనుచరులు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. కార్యకర్తలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రచారంలో పాల్గొనకుండానే రేగా, అతని అనుచరులు వెనుదిరిగారు.

Latest Updates