మేడిపల్లిలో ఉద్రిక్తత..ఎమ్మెల్యే కిషన్ రెడ్డిని అడ్డుకున్నగ్రామస్తులు

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువు నిండింది. చెరువుకు పూజలు చేసేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి వచ్చారు. దీంతో ఎమ్మెల్యేను అడ్డుకునేందుకు ప్రయత్నించారు గ్రామస్తులు. ఫార్మాతో భూములు కోల్పోతుంటే… కనీసం పరామర్శించకుండా… బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు గ్రామస్తులు. అటు గ్రామంలోని స్థానిక నేతలను ముందుగానే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. అయితే గ్రామస్తులు ఆందోళన నిర్వహిస్తుండటంతో కాలుతో తన్నారు ఎస్సై సురేష్ బాబు. దీంతో ఎమ్మెల్యే వాహనంపై రాళ్లు, చెప్పులు విసిరారు స్థానికులు.

కుప్ప కూలిన సర్దార్ సర్వాయి పాపన్నకోట

జీహెచ్ఎంసీ అధికారులపై కిషన్ రెడ్డి సీరియస్

గతేడాది కంటే పెరిగిన ప్రధాని మోడీ సంపాదన

 

Latest Updates