ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి చేదు అనుభవం

villagers stopped MLA Vittal Reddy in his election campaign

నిర్మల్: టి.ఆర్.ఎస్ నేత, ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలోని బాసర మండలం ఓని గ్రామంలో పర్యటిస్తున్న ఆయనను గ్రామస్థులు అడ్డుకున్నారు. మరికొన్ని రోజుల్లో బాసర మండలంలో జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్న క్రమంలో ఆ ఊరి ప్రజలు ఆయన్ను ప్రచారం చేయకుండా అడ్డుకున్నారు. స్థానికులకు టిక్కెట్ ఇవ్వకుండా ఇతరులకు ఎలా ఇస్తారని నిలదీశారు. దీంతో అక్కడ గ్రామస్థులకు, పార్టీ కార్యకర్తల మధ్య చిన్న గొడవ జరిగింది.

Latest Updates