వేలంలో బాలాపూర్ లడ్డూను దాటేసిన వినాయక్ నగర్ లడ్డూ

హైదరాబాద్ లో గణపతి లడ్డూ వేలం పాటల్లో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. ఫిలింనగర్లోని వినాయక్ నగర్ బస్తీలో గణపతి లడ్డూ ధర.. బాలాపూర్ లడ్డూ వేలం ధరను మించి పలికింది. రూ.17లక్షల 75 వేలకు గణేశ్ లడ్డూను దక్కించుకున్నారు బీజేపీ నేత పల్లపు గోవర్ధన్.

గత ఏడాది వినాయక్ నగర్ వినాయకుడి లడ్డూ ధర రూ.15.1 లక్షలు పలికింది. గత ఏడాది నగరంలో రెండో స్థానంలో వినాయక్ నగర్ లడ్డూ నిలిచింది.

ఈ ఉదయం బాలాపూర్ లడ్డూ వేలం నిర్వహించారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలాన్ని హైదరాబాదే కాదు.. తెలుగు రాష్ట్రాలు ఆసక్తిగా గమనించాయి. పొరుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా బాలాపూర్ లడ్డూ వేలంలో పాల్గొన్నారు. ఉత్కంఠ మధ్య పోటాపోటీగా జరిగిన వేలంలో గత రికార్డుల చెరిపేస్తూ… రూ.17లక్షల 60వేలకు కొలన్ కుటుంబసభ్యుడు కొలన్ రాంరెడ్డి దక్కించుకున్నారు.

Latest Updates