విమానంలో ఒక్కడే… ఇసుక సంచులు వేసి కవర్ చేశారు..!

సాధారణంగా విమానంలో రెండువందల నుంచి మూడువందల మంది ప్రయాణిస్తారు. అయితే ఒక్కరే విమానంలో ప్రయాణించిన ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి. ఇలాంటి ఘటనే కొలరాడోలోని ఆస్పెన్‌ లో జరిగింది. న్యూయార్క్ కు చెందిన ప్రముఖ రచయిత, దర్శకుడు విన్సెంట్ పియోన్ కొలరాడోలోని అస్పెన్ నుంచి సాల్ట్‌లేక్‌ సిటీలోని తన ఇంటికి వెళ్లేందుకు బయల్దేరాడు. విమానాశ్రయంలోకి వెళ్లగానే బోర్డింగ్‌ వద్ద సిబ్బంది ఈ విమానంలో ప్రయాణించేది మీరు ఒక్కరే అని చెప్పడంతో అతడు షాక్ అయ్యాడు. అయితే ఇలా ముందెప్పుడైనా జరిగిందా అని విమాన సిబ్బందిని విన్సెంట్ అడుగగా… చాలా తక్కువగా జరిగాయని చెప్పారు.

ఆ తర్వాత  తానొక్కడినే ప్రయాణికుడిని కావడంతో కార్గో సిబ్బంది విమానంలో బరువు ఉండటానికి ఇసుక సంచులు వేయడం గమనించానని సోషల్ మీడియాలో తెలిపారు విన్సెంట్.  విమానం లోపలకు వెళ్లగానే ఒక్కడినే అయినా తనకు స్వాగతం పలికారని చెప్పాడు. విమానంలో ప్రయాణించిన వీడియోను పియోన్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో అది వైరల్‌గా మారింది.

Latest Updates