AIIMS పీజీ టెస్ట్ లో టాపర్ గా గుంటూరు యువతి వినీతా కన్నెగంటి

న్యూఢిల్లీలోని ఎయిమ్స్ నిర్వహించిన పీజీ ఎంట్రెన్స్ టెస్ట్ లో ఆంధ్రప్రదేశ్ గుంటూరుకు చెందిన డాక్టర్ వినీతా కన్నెగంటి టాపర్ గా నిలిచారు. భువనేశ్వర్ AIIMS లో వైద్య విద్యను అభ్యసించిన వినీత, జూన్ 11న నిర్వహించిన పరీక్షల్లో  ఫస్ట్ ర్యాంకు సాధించారు. వినీతతో పాటు భువనేశ్వర్ ఎయిమ్స్ కు చెందిన మొత్తం ఆరుగురు వంద లోపు ర్యాంకులు సాధించారు.

పీజీలో జనరల్ మెడిసిన్ ను ఎంచుకోనున్నట్లు గా తెలిపారు వినీత. గతేడాది డిసెంబర్ లోనే తన ఎంబీబీఎస్ పూర్తయిందని తెలిపారు. ఈ పరీక్షల కోసం కష్టపడ్డానని, ఇప్పుడు తనకెంతో ఆనందంగా ఉందని అన్నారు. తన పీజీ విద్యను ఢిల్లీ ఎయిమ్స్ లేదా చండీగఢ్ లోని మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో గానీ పూర్తి చేస్తానని ఆమె చెప్పారు.

Latest Updates