వ‌ర‌ల్డ్ రెజ్లింగ్ చాంపియ‌న్‌షిప్‌ : వినేశ్ పోగ‌ట్ కు కాంస్యం

క‌జ‌కిస్తాన్‌ వేదికగా జ‌రుగుతున్న‌ వ‌ర‌ల్డ్ రెజ్లింగ్ చాంపియ‌న్‌షిప్‌ లో కాంస్య ప‌త‌కాన్ని గెల‌చుకుంది భారత రెజ్ల‌ర్ వినేశ్ పోగ‌ట్‌. 53 కిలోల ఈవెంట్‌ లో వినేశ్.. మారియా ప్రివోల‌రికీపై 4-1 తేడాతో గెలిచి మెడల్ ని త‌న ఖాతాలో వేసుకుంది. ఫస్ట్ టైం వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌షిప్‌ లో మెడ‌ల్ సాధించిన‌ట్లు వినేశ్ తెలిపింది.

మెడల్ రావడం ఎంతో గ‌ర్వంగా ఉంద‌ని ఆమె చెప్పింది. అయిదేళ్లుగా వ‌ర‌ల్డ్ మెడ‌ల్ కోసం ట్రై చేస్తున్న‌ట్లు తెలిపిన వినేశ్.. ఒలింపిక్ కోటా కూడా సాధించ‌డం గ‌ర్వంగా ఉన్న‌ట్లు చెప్పింది.