లంక ఎప్పుడూ రగులుతూనే…

ప్రపంచంలోనే అందమైన దీవుల్లో శ్రీలంక ఒకటి. ఆ అందానికిమురిసిపోయి అడుగుపెడితే వెనక్కి వస్తామో రామో చెప్పలేనిపరిస్థితి. దాదాపు 35 ఏళ్లుగా ఎన్నో జాతుల ఘర్షణలనుతట్టుకుం ది. ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటు న్న లంక నెత్తిన సూసైడ్‌బాం బర్లు విరుచుకుపడ్డా రు. శ్రీలంకలో హింస ఎన్నో ఏళ్లుగా ఏదోఒక రూపంలో కొనసాగుతూనే ఉంది. తాజా దారుణం శ్రీలంకచరిత్రను మరో దిక్కుకు లాక్కెళ్లింది.

శ్రీలంకలో జాతుల సమస్య నేపథ్యంsలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం ( ఎల్టీటీఈ) పేరుతో ఓవేర్పాటువాద సంస్థను 1976 మే 5 వేలుపిళ్లై ప్రభాకరన్ ఏర్పాటు చేశాడు. శ్రీలంకలో స్వతంత్ర తమిళ రాష్ట్రంఏర్పాటు ఈ సంస్థ లక్ష్యం. ఎల్టీటీఈ కార్యకర్తలు టైగర్లుగా పాపులర్. ఆత్మాహుతి బాంబు దాడులకు ఈ సంస్థమరో పేరుగా మారింది. తమ డిమాండ్ల సాధన కోసం శ్రీలంక ప్రభుత్వంతో అనేక సార్లు ఎల్టీటీఈ చర్చలు జరిపింది. అయితే రకరకాల కారణాలతో ఈ చర్చలు ఫెయిల్ అయ్యాయి. ఈ పరిస్థితుల్లో శ్రీలంకలో శాంతి నెలకొల్పడం కోసం ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ( ఐపీకే ఎఫ్ ) పేరుతో రాజీవ్ గాంధీ హయాంలో ఇండియా తన సైనిక బలగాలను పంపింది. రాజీవ్ చర్యను ఎల్టీటీఈ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నేపథ్యం లోనే బెల్ట్ బాంబు దాడితో రాజీవ్ ను తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో ఆత్మాహుతి దాడి జరిపి ఎల్టీటీఈ హత్యచేసింది. ఆ తర్వాత శ్రీలంక రాజకీయాల్లో మార్పులు వచ్చాయి. 2009 లో వేలు పిళ్లై ప్రభాకరన్ హత్య తర్వాత ఎల్టీటీఈ పూర్తిగా ఛిన్నాభిన్నమైం ది. శ్రీలంకలో ప్రశాంతత నెలకొంది.

రెండు మతాలు… ఎన్నో విధ్వంసాలు
శ్రీలంకలో తమిళ టైగర్లను పూర్తిగా మట్టు బెట్టాక… కొన్నేళ్లపాటు ప్రశాంతంగానే ఉంది. ఆ తర్వాత కొత్తగా మెజారిటీలైన బౌద్ధులకు, మైనారిటీలైన ముస్లింలకు మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. బోదు బాల సేన(బీబీఎస్‌ )వంటి గ్రూప్‌ లు మైనారిటీలపై దాడులకు దిగాయి. సింహళీ బుద్ధిస్ట్‌‌‌‌ నేషనలిజం అనేది తలెత్తింది. హలాల్‌ సర్టిఫికేషన్‌ని, బుర్ఖాలు వేసుకోవడాన్ని, మసీదులు కట్టు కోవడాన్ని వ్యతిరేకించారు. శ్రీలంకలో ఇస్లామీకరణను బౌద్ధులు పూర్తిగా వ్యతిరేకించారు. 2014 జూన్‌ లో నైరుతి శ్రీలంకలో మైనారిటీలపై దాడులు పెద్ద ఎత్తున సాగాయి. కలుతర జిల్లాలోని అనేక ఊళ్లు స్మశానాలయ్యాయి. దుకాణాలు, ఫ్యాక్టరీలు, మసీదులు, నర్సరీలను టార్గెట్‌ చేసుకోవడంతో దాదాపు 10 వేల మంది వేరే చోట్లకు పారిపోయి తలదాచుకోవలసి వచ్చింది. 2018లో కొంత మంది బుద్ధిస్ట్‌‌‌‌లు క్యాండీలోని ముస్లింల ఇళ్లపై దాడులు చేశారు. దానికి ప్రతిగా బౌద్ధులపై హింసకు దిగారు. పోయినేడాది దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వచ్చింది.

Latest Updates