ఓటు చైతన్యం : పోలింగ్ లో ప్రముఖులు, వృద్ధులు

అహ్మదాబాద్ లో ఓటేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. నారన్ పురా సబ్ జోనల్ ఆఫీస్ లో అమిత్ షా, ఆయన భార్య సోనాల్ షా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ , ఆయన భార్య అంజలి రాజ్ కోట్ లోని జ్ఞాన్ మందిర్ స్కూల్ లో పోలింగ్ లో పాల్గొన్నారు.

భువనేశ్వర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి, మాజీ IAS అధికారి అపరాజిత సారంగి ఒడిశాలో ఓటేశారు.

మహారాష్ట్రలోని బారామతిలో నేషనల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ సుప్రియా సూలే , ఆమె కుటుంబసభ్యులు ఓటుహక్కు వినియోగించుకున్నారు.

ఒడిశాలోని తాల్చర్ పోలింగ్ బూత్ లో కేంద్రమంత్రి ధర్మంద్ర ప్రధాన్ ఓటేశారు.

మహారాష్ట్ర పుణెలో 93 ఏళ్ల ప్రభాకర్ భిడే, ఆయన భార్య 88 ఏళ్ల సుశీలా భిడే ఓటేసి యువతకు ఆదర్శంగా నిలిచారు.

పశ్చిమబెంగాల్ లోని మాల్దాలో ఓ వ్యక్తి 87ఏళ్ల తన తల్లిని మోసుకుంటూ పోలింగ్ స్టేషన్ కు తీసుకొచ్చాడు. తల్లితో ఓటు వేయించాడు.

Latest Updates