వైరల్ వీడియో: తుపాకీతో కేక్ కట్ చేసినందుకు..

  • స్నేహితుడితో కలసి కటకటాల పాలు

బ్యాక్ గ్రౌండ్ లో చెవులు హోరెత్తించే మ్యూజిక్.. టేబుల్ పై అందంగా డిజైన్ చేసిన నోరూరించే కేక్.. దాని ముందు నిల్చున్న ఎర్రచొక్కా, జీన్స్ ప్యాంట్ వేసుకున్న యువకుడు చేతిలో పిస్టల్ పట్టుకుని కేక్ కట్ చేయగా.. వేడుకకు హాజరైన అతని ఫ్రెండ్స్ అంతా హ్యాపి బర్త్ డే.. టూ యూ అంటూ కేరింతలు కొడతారు. దాదాపు 20 సెకన్లు ఉన్న ఈ వీడియోను సరదాగా సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ కు షేర్ చేశారు. కొద్దిపేసట్లోని అది పోలీసుల దృష్టికి వెళ్లింది. యువకుల చేతిలో నాటు తుపాకీ చూసి పోలీసులు షాక్ అయ్యారు. ఆ యువతీ యువకుల కోసం పోలీసులు గాలించి మరీ పట్టుకుని అరెస్టు చేయడంతో ఆ వీడియో మరింత వైరల్ అయింది. ఉత్తర్ ప్రదేశ్ లోని హాపూర్‌లో జరిగిన ఘటన కలకలం రేపింది. నాటు తుపాకీతో కేక్ కట్ చేసిన యువకుడు షానవాజ్ తోపాటు వీడియోలో కనిపించిన అతని స్నేహితుడు షకీబ్ ను పోలీసులు అరెస్టు చేశారు. వారు ఉపయోగించిన కంట్రీమేడ్ పిస్టల్ (నాటు తుపాకీ)ని కూడా స్వాధీనం చేసుకున్నారు. వీరికి తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

కేక్ కట్ చేస్తున్న వైరల్ వీడియో ఇదే..

ఇవి కూడా చదవండి

బైకుపై 5 ఖండాల్లో 37 దేశాలు చుట్టొచ్చాడు..కానీ

పెనుకొండలో ప్రత్యక్షమైన వింతపక్షి

ప్రతి ఇంటికి ఉచితంగా ఇంటర్నెట్.. సగం ధరకే లాప్‌టాప్

గాలిపటం కోసం పరిగెడుతూ..పెంటకుప్పలో పడి బాలుడి మృతి

Latest Updates