వైరల్ వీడియో: వామ్మో.. ఇంత భారీ ఆమ్లెట్‌‌ను ఎప్పుడూ చూసుండరు!

న్యూఢిల్లీ: ఆహార ప్రియులను ఆకట్టుకోవడానికి చాలా మంది షెఫ్‌‌లు, వంట చేయడంలో నేర్పు సాధించిన వారు కొత్త వంటకాలను తయారు చేస్తుంటారు. వీటిలో కొన్ని సక్సెస్ అవుతుంటాయి. మరికొన్ని పెద్దగా ఆకట్టుకోవు. తాజాగా కొరియాలో ఓ వ్యక్తి భారీ ఆమ్లెట్‌‌ను సిద్ధం చేసి ఎట్రాక్ట్ చేసే యత్నం చేశాడు. ఏకంగా 60 గుడ్లతో భారీ ఆమ్లెట్‌‌ను తయారు చేసి కస్టమర్లకు వడ్డించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముందుగా ఓ ట్రేలో 60 గుడ్లను పగులగొట్టిన సదరు షెఫ్.. ఆ తర్వాత వాటిలో క్యారెట్ ముక్కలు, ఉల్లి ఆకులను, మాంసాన్ని వేశాడు. తర్వాత ఓ ప్యాన్‌లో నెయ్యి వేసి గుడ్ల మిశ్రమాన్ని అందులో కలిపాడు. ఆమ్లెట్ లేయర్‌‌‌‌లతో భారీ బ్రెడ్ ముక్కగా తయారు చేశాడు. అనంతరం దాన్ని ముక్కలుగా కోసి వాటిని ప్యాక్ చేసి కంటెయినర్‌‌లో భద్రపరిచాడు. ఈ వీడియోకు 17 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

Latest Updates