వైరల్ వీడియో: పిల్లాడ్ని కాపాడటానికి బైక్ మీద నుంచి దూకేశాడు

న్యూఢిల్లీ: బైకుపై వెళ్తున్న ఓ వ్యక్తి అద్భుతంగా ఒక పిల్లాడ్ని కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీసీటీవీలో రికార్డు అయిన సదరు వీడియో ఇప్పుడు నెట్‌‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోకు ఇప్పటికే 2 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. వివరాలు.. పిల్లాడు కూర్చున్న వాకర్ రోడ్డు మీద నుంచి కింద వైపుగా దొర్లుకుంటూ వెళ్తోంది. అదే సమయలో అటుగా బైక్ పై వెళ్తున్న వ్యక్తి దీన్ని గమనించి వెంటనే బండి మీద నుంచి దూకేశాడు. వాకర్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి పిల్లాడ్ని కాపాడాడు. బైక్ పై నుంచి దూకి పిల్లాడ్ని కాపాడినందుకు సదరు వ్యక్తిని నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు. దీన్నో సూపర్ మ్యాన్ ఎఫర్ట్‌‌‌గా పేర్కొంటున్నారు. మరి, ఈ సూపర్ మ్యాన్ ఫీట్‌‌ను మీరూ చూసేయండి.

Latest Updates