హ్యాండ్ వాష్ ఉపయోగమిది..కొత్తగా చెప్పిన టీచర్

చేతులు కడుక్కోవడం ఎంత ఇంపార్టెంటో పెద్దలకు తెలుసు. మరి, పిల్లలకు..? చెప్పినా అర్థం చేసుకునే వయసు కాదది. అందుకే ఓ టీచర్​,హ్యాండ్​వాష్​ వల్ల ఎంత లాభమో పిల్లలకు కొత్తగా చెప్పారు. కరోనా వైరస్​ విజృంభిస్తుండడంతో పిల్లల్లో కొంతైనా అవగాహన కల్పించేందుకు ఆమె చేసిన ప్రయోగం అందరి మన్ననలను అందుకుంటోంది. ఓ గిన్నెలో నీళ్లు తీసుకుని, అందులో పెప్పర్​ (మిరియాల పొడి)ని యాడ్​ చేసింది. దాన్నే కరోనా వైరస్​గా పిల్లలను అనుకోమంది. ఓ చిన్నారిని ఆ వైరస్​ ఉన్న నీళ్లలో పెట్టమంది. వైరస్​ (పెప్పర్​) అంటాక వేలును తీసుకెళ్లి సబ్బు నీళ్లలో ముంచమని చెప్పింది. ఇప్పుడు ఆ సబ్బున్న వేలును మళ్లీ వైరస్​ ఉన్న నీళ్లలో పెట్టమని చెప్పింది. వెంటనే సబ్బున్న వేలికి దూరంగా వైరస్​ వెళ్లిపోయింది. స్టూడెంట్లు ఆ ప్రయోగాన్ని చూసి ఆశ్చర్యపోయారు. సబ్బుతో చేతులు కడుక్కోవడం వల్ల వైరస్​లు ఎంత దూరంగా పారిపోతాయో అర్థమైంది కదా అంటూ టీచర్​ ప్రయోగాన్ని ముగించారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​ అయింది.

Latest Updates