వైరల్ వీడియో: క్రికెట్ మ్యాచ్ లో ఒక్కటైన  ప్రేమ జంట

సిడ్నీ: ఆస్ట్రేలియాలో సిడ్నీ వేదికగా జరుగుతున్న రెండో వన్డే గతంలో ఎన్నడూ జరగని.. ఊహించని సన్నివేశానికి వేదికగా మారింది. ఆస్ట్రేలియా పెట్టిన 389 పరుగుల భారీ  టార్గెట్ ను ఛేదించేందుకు ఇండియా బ్యాటింగ్ చేస్తోంది. 20 ఓవర్ల సమయంలో కెప్టెన్ కోహ్లి, శ్రేయస్ లు మైదానంలో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇదే సమయంలో మరో వైపు  ప్రేక్షకుల గ్యాలరీలో ఊహించని సంఘటన జరిగింది. భారత జట్టు జెర్సీ ధరించిన భారత యువకుడు తన ఆస్ట్రేలియన్ లవర్ కు ప్రపోజ్ చేశాడు. అది కూడా సినీ ఫక్కీలో.. యువతి ముందు మోకాళ్లలో కూర్చుని..  నేనంటే ఇష్టమేనా..  పెళ్లి చేసుకుంటావా అంటూ.. మోకాళ్లపై కూర్చుని బాక్స్ ఓపెన్ చేసి రింగ్ చూపిస్తూ  ప్రపోజ్ చేశాడు…  వినూత్న తరహాలో చేసిన  ప్రపోజల్ కు ఆస్ట్రేలియన్ యువతి  పొంగిపోయింది. సంభ్రమాశ్చర్యంలో నుండి తేరుకుని రింగ్ ను ఆమె తీసుకుని ఓకే చెప్పింది. దీంతో అతను వెంటనే ఆమెను హగ్ చేసుకుని కిస్ చేయడం క్షణాల్లో జరిగిపోయింది.

స్టేడియంలోని  ప్రేక్షకులంతా  రసవత్తరంగా జరిగిన మ్యాచ్ ను చూడడంలో తలమునకలై ఉన్నారు. జంట ను గమనించే స్థితిలో లేరు. చప్పట్లు కొడుతూ మైదానంలోని కోహ్లి.. శ్రేయస్ లను హుషారెత్తిస్తున్న సమయంలో ప్రేక్షకుల మధ్యలోని ఈ  ప్రేమ జంట ఒక్కటి కావడం.. కెమెరా కంటికి చిక్కింది. అలాగే   స్టేడియంలోని ప్రేక్షకుల మధ్యలో జరిగిన ఈ సీన్ ను మైదానంలోనుండి గమనించిన ఆసీస్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ రియాక్ట్ కూడా అయ్యాడు .. చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేయడం.. అది కూడా కెమెరా కంటికి చిక్కింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది….

వీడియో ఇదే..

for more News…

వీ6 స్పెషల్ ఇంటర్వ్యూ: వరదలొచ్చినప్పుడు కేసీఆర్, ఒవైసీ ఎక్కడున్నారు?

ఓటింగ్ పెంపునకు జీహెచ్ఎంసీ వినూత్న చర్యలు

మన సంస్కృతి ఎమోషనల్‌‌ రీచార్జ్‌‌లా పని చేస్తుంది

Latest Updates