వైరల్ వీడియో: అందానికి అందం.. విషానికి విషం

న్యూఢిల్లీ: ప్రపంచంలో చాలా రకాల జాతులకు చెందిన పాములు ఉన్నాయి. అయితే వాటిల్లో బ్లూ స్నేక్స్ మాత్రం తక్కువ. తమ రంగే ఆ పాములకు చాలా పాపులారిటీ తీసుకొచ్చాయి. అలాంటి అరుదైన పామే ఈ బ్లూ పిట్ వైపర్. ఈ స్నేక్‌కు ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి అటెన్షన్ లభిస్తోంది. బ్లూ స్నేక్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పాము అందానికి మగువలు కూడా ఫిదా అవుతున్నారు. ఎంత అందంగా ఉందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎరుపు రంగు గులాబీ పువ్వుపై కూర్చొని ఉన్న బ్లూ స్నేక్ వీడియో వైరల్ అవుతోంది. అయితే ఈ పాము అందంగా కనిపిస్తోంది కదా అని హానికరమైనది కాదని భావిస్తే పప్పులో కాలేసినట్లే. ఇదో ప్రాణాంతక విష పాము. దీని విషపు కాటుతో మానవ శరీరంలో అంతర్గతంగా, బాహ్యంగా తీవ్ర రక్తస్రావం అవుతుందని తెలుస్తోంది. ఈ లెక్కన ఈ పాములు అందానికి అందం, విషానికి విషం అనేలా ఉన్నాయని చెప్పొచ్చు. ఇలాంటి పాములు ఇండోనేషియాతోపాటు ఈస్ట్ తిమోర్‌‌‌లో గుర్తించామని మాస్కో జూ తెలిపింది. లైఫ్ ఆన్ బ్లూ అనే ట్విట్టర్ అకౌంట్‌‌లో షేర్ అయిన ఈ అందమైన పాము వీడియోను మీరూ చూసేయండి.

Latest Updates