(వైరల్) నాకు కోపం వచ్చింది..రూ.2.4కోట్ల మెర్సిడెజ్ బెంజ్ తగలబెట్టా

నాకు కోపం వచ్చింది అందుకే రూ.2.4 కోట్ల విలువైన మెర్సిడెజ్ బెంజ్  తగ్గలబెట్టానంటూ విచారం వ్యక్తం చేశాడో యువకుడు. రష్యాకు చెందిన ప్రముఖ యూట్యూబర్ మైఖెల్ లిట్విన్..జర్మనీ లో రూ.2.4 కోట్లు పెట్టి మెర్సిడెజ్ బెంజ్ షోరూం లో కారును కొనుగోలు చేశాడు. కొన్ని రోజులు  బాగా ఎంజాయ్ చేసినా ఆ తరువాతే అసలు కష్టాలు మొదలయ్యాయి. 40రోజుల్లో ఐదు సార్లు మెర్సిడెజ్ షోరూమ్ సర్వీస్ సెంటర్ కు తీసుకెళ్లాడు. కానీ లాభం లేదు. మరోసారి రిపేర్ రావడంతో షోరూమ్ కి ఫోన్ చేశాడు. అటునుంచి ఎటువంటి రిప్లయ్ రాలేదు. దీంతో మెర్సిడెజ్ బెంజ్ షోరూమ్ నిర్వాహకులపై మైఖెల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బెంజ్ కారును నిర్మానుష్యప్రాంతానికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగ్గలబెట్టాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Latest Updates