విషమంగా విరసం నేత వరవరరావు పరిస్థితి

విరసం నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందంటూ ముంబై తలోజా జైలు అధికారులు ఆయన భార్యకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. కొన్నిరోజుల క్రితమే ఆరోగ్యం బాగా లేదంటూ బెయిల్ కోసం వరవరరావు… మహారాష్ట్ర కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేసింది. భీమా కోరేగావ్ కుట్రలో వరవరరావు పాత్ర కీలకమని, ఆయనకు బెయిల్ ఇవ్వరాదని ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది. ప్రస్తుతం వరవరరావు ఆరోగ్యం బాగా దెబ్బతిన్నదన్న సమాచారంతో ఆయన కుటుంబ సభ్యుల్లో తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతానికి ఆయనకు ముంబై తలోజా జైల్లోనే చికిత్స అందిస్తున్నట్టు జైలు అధికారులు తెలిపారు.

Latest Updates