ఒక్కరితో ప్రపంచ కప్ గెలవలేం: సచిన్

Virat Kohli alone can’t win World Cup, others will need to step up: Tendulkar

ఒంటరి పోరాటంతో ప్రపంచ కప్‌ ను సాధించడం కష్టమని, జట్టుగా ఆడితేనే కప్పు గెలవడం సాధ్యమవుతుందని మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ అన్నారు.  ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్ మాట్లాడుతూ.. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఒక్కరే ప్రపంచ కప్ గెలవలేరని, అతనికి జట్టులో ఉన్న క్రికెటర్లంతా కూడా మద్దతిస్తేనే విజయం సులభమవుతుందని తన అభిప్రాయాన్ని తెలిపాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌ లో నాలుగో స్థానం పరిస్థితిని బట్టి భర్తీ చేస్తే సరిపోతుందని, జట్టులో ప్రతిభావంతులైన బ్యాట్స్‌ మెన్స్‌ ఉన్నారని గుర్తుచేశారు. అవసరాన్ని బట్టి ఏ స్థానంలోనైనా ఆడేందుకు ప్రతి ఒక్క బ్యాట్స్‌మెన్‌ సిద్ధంగా ఉన్నారని సచిన్ అన్నారు.

Latest Updates