టాప్‌ -2లోనే విరాట్ కోహ్లీ, రోహిత్‌

‌‌‌దుబాయ్‌‌‌‌: టీమిండియా కెప్టెన్‌‌‌‌ విరాట్‌‌‌‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌‌‌‌ రోహిత్‌ శర్మ.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ లో తొలి రెండు స్థానాల్లోనే కొనసాగుతున్నారు. బౌలింగ్‌‌‌‌లో టాప్‌ పేసర్‌‌‌‌ జస్‌ ప్రీత్‌ బుమ్రా రెండో ర్యాంక్‌ ను నిలబెట్టుకున్నాడు. బుధవారం విడుదల చేసిన లెటెస్ట్​ లిస్ట్‌‌‌‌లో కోహ్లీ 871, రోహిత్‌ 855 పాయింట్లతో ఉన్నారు. బాబర్‌‌‌‌ ఆజమ్‌ (829), రాస్‌ టేలర్‌‌‌‌ (818), డుఫ్లెసిస్‌ (790) వరుసగా మూడు, నాలుగు, ఐదు ర్యాంకుల్లో ఉన్నారు. ఐర్లాండ్‌ కెప్టెన్‌‌‌‌ బాల్‌‌‌‌బిర్ని నాలుగు స్థానాలు ఎగబాకి 42వ ర్యాంక్‌ కు చేరగా, పాల్‌‌‌‌ స్టిర్లింగ్‌‌‌‌ 26వ ర్యాంక్‌ ను దక్కించుకున్నాడు. ఇంగ్లండ్‌ కెప్టెన్‌‌‌‌ ఇయాన్‌‌‌‌ మోర్గాన్‌‌‌‌ 22వ ర్యాంక్‌ లో, బెయిర్‌‌‌‌‌ స్టో 13వ ర్యాంకులో నిలిచారు. బౌలింగ్‌‌‌‌లో ట్రెంట్‌‌‌‌ బౌల్ట్‌‌‌‌ (722) నంబర్‌‌‌‌వన్‌‌‌‌ ర్యాంక్‌ లో ఉండగా, బుమ్రా (719) తర్వాతి ర్యాంక్‌ లో కొనసాగుతున్నాడు.

Latest Updates