కోహ్లీ మరో వరల్డ్ రికార్డ్.. సచిన్ రికార్డ్ బ్రేక్

పరుగుల మిషన్ వీరాట్ కోహ్లీ మరో ప్రపంచ రికార్డ్ బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద  అత్యంత వేగంగా 12 వేల రన్స్ చేసిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. అంతేగాకుండా 242 వన్డేల్లోనే అత్యంత వేగంగా 12 వేల రన్స్ చేసి సచిన్ రికార్డ్ ను బ్రేక్ చేశాడు. గతంలో సచిన్ టెండుల్కర్ 300 ఇన్నింగ్స్ లలోనే 12 వేల రన్స్ చేశాడు.  సచిన్ కంటే ఫాస్ట్ గా కోహ్లీ ఈ రికార్డును సృష్టించడంతో తన ఫ్యాన్స్  ఖుషీ అవుతున్నారు. వన్డేల్లో కోహ్లీ 43 సెంచరీలు ,59 హాఫ్ సెంచరీలు చేశాడు.

12 వేల పరుగులు చేసిన ఆటగాళ్లు ఆడిన మ్యాచ్ లు

  • వీరాట్ కోహ్లీ 251 మ్యాచ్ లు 242 ఇన్నింగ్స్
  • సచిన్ టెండుల్కర్ 309 మ్యాచ్ లు 300 ఇన్నింగ్స్
  • రిక్కీ పాంటింగ్ 323 మ్యాచ్ లు 314 ఇన్నింగ్స్
  • కుమార సంగక్కర 359 మ్యచ్ లు 336 ఇన్నింగ్స్
  • సనత్ జయసూర్య 390 మ్యాచ్ లు 379 ఇన్నింగ్స్

Latest Updates