సచిన్‌ రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ

virat-kohli-breaks-tendulkars-record

టీమిండియా  కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మరో రికార్డ్ సొంతం చేసుకున్నాడు. అది కూడా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. విండీస్‌తో ఆదివారం జరిగిన రెండో వన్డేలో కోహ్లీ120 పరుగులు చేశాడు.

ప్రపంచంలోని మూడు వన్డే జట్లపై 8 అంతకన్నా ఎక్కువ సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా కోహ్లీ కొత్త రికార్డు సృష్టించాడు. ఇదివరకు ఆసీస్‌, శ్రీలంక జట్లపై ఎనిమిదేసి సెంచరీలు చేసిన కోహ్లీ… తాజాగా విండీస్‌పై ఈ ఘనత సాధించాడు. అంతకు ముందు మాస్టర్‌బ్లాస్టర్‌ సచిన్‌ ఆసీస్‌పై 9, శ్రీలంకపై 8 సెంచరీలు చేశాడు. ఈ క్రమంలో సచిన్‌ రెండు జట్లపై సెంచరీలు చేయగా…కోహ్లీ మూడు జట్లపై 8 శతకాలు సాధించి భారీ రికార్డు సృష్టించాడు.

Latest Updates