ఒక్క పోస్ట్ తో కోట్లు కొల్లగొట్టేస్తున్న సెలబ్రిటీలు

ఆ కంపెనీకి చెందిన ఉత్పత్తులు బాగున్నాయి.. నేను కూడా అదే వాడతాను అంటూ సెలబ్రిటీలు కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. గతంలో ప్రముఖ కంపెనీ ప్రొడక్స్ గురించి ప్రచారం చేయాలంటే సెలబ్రిటీలు గంటల కొద్ది సమయాన్ని వెచ్చించేవారు. కానీ ఈ డిజిటల్ యుగంలో ఒక్క క్లిక్ తో యాడ్స్ ను  ప్రచారం చేస్తున్నారు. ప్రచారంతో భారీగా సంపాదిస్తున్నారు.

ఆ కంపెనీకి చెందిన ఉత్పత్తులు బాగున్నాయి నేను కూడా అదే వాడతాను అంటూ సెలబ్రిటీలు కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. గతంలో ప్రముఖ కంపెనీ ప్రొడక్స్ గురించి ప్రచారం చేయాలంటే సెలబ్రిటీలు గంటల కొద్ది సమాయాన్ని వెచ్చించేవారు. కానీ ఈ డిజిటల్ యుగంలో ఒక్క క్లిక్ తో యాడ్స్ రూపంలో భారీగా సంపాదిస్తున్నారు. ఆయా రంగాలకు చెందిన సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా నెట్ వర్క్ లలో కంపెనీ ఉత్పత్తుల గురించి పోస్ట్ చేస్తున్నారు. దీంతో వారి అభిమానులు సైతం ఆ కంపెనీకి చెందిన బ్రాండ్ లను కొనుగులు చేయడంతో ఈ తరహా మార్కెటింగ్ జోరందుకుంది. దీంతో పెద్ద పెద్ద కంపెనీలు సినీ, స్పోర్ట్స్ సెలబ్రిటీల వెంటపడుతున్నాయి. సోషల్ మీడియా నెట్ వర్క్ ల ద్వారా తమ ఉత్పత్తుల గురించి ప్రచారం చేసుకుంటూ లాభాల్ని గడిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా నెట్ వర్క్ లలో ఇన్ స్టాగ్రాం కంపెనీ ఉత్పత్తుల ప్రచారానికి వేధికగా నిలిచింది. సెలబ్రిటీల ఇన్ స్టాగ్రాంలో ఫాలోవర్స్ ను బట్టి పలు కంపెనీల బ్రాండ్ లకు ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారానికి ఒక్కో పోస్ట్ కు కోట్లలో వసూలు చేస్తున్నారు.

వారిలో  విరాట్ కోహ్లీ రూ.1కోటి 35లక్షలు , ప్రియాంక చౌప్రా రూ.1 కోటి 35లక్షలు, జస్టిన్ బీబర్ రూ.7.22కోట్లు,  ఫుట్ బాల్ ప్లేయర్ నియామార్ ద సిల్వా రూ. 7.22కోట్లు, టేలర్ స్విప్ట్ రూ. 7.48కోట్లు, బియావన్ నోలెస్ రూ. 7.85కోట్లు, యాక్టర్ డ్వైన్ జాన్సన్ రూ. 8.22కోట్లు, సెలీనా గుమేజ్ రూ. 8.86కోట్లు, కిమ్ కుర్దాషియన్ రూ. 9.10కోట్లు, ప్రముఖ ఫుట్ బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డ్ రూ. 9.75కోట్లు, సింగర్ అరైనా గ్రాండే రూ.9.96కోట్లు, కెల్లీ జెన్సీర్ రూ.1.27కోట్లు వసూలు చేస్తున్నారు.

Latest Updates