కోహ్లీ వరల్డ్‌‌లో బెస్ట్‌‌ బ్యాట్స్‌మన్‌ .. పాక్ లెజెండ్

కరాచీ: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ .. తన ఫేవరెట్‌ బ్యాట్స్‌ మన్‌ అని పాకిస్థాన్‌ లెజెండ్‌ ప్లేయర్‌ జావేద్‌ మియాందాద్‌ అన్నాడు. చాలా రికార్డులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయని గుర్తు చేశాడు. విరాట్‌ క్లాసీ బ్యాటింగ్‌ స్కిల్స్‌ క్రికెట్‌ ప్రపంచంలో ఎవరికీ లేవన్నాడు. ‘ప్రస్తుత టీమిండియా లైనప్‌ , డెప్త్‌‌ చాలా అద్భుతం. మంచి నైపుణ్యం ఉన్న ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు. ముఖ్యంగా విరాట్‌ స్టాట్స్‌ చూస్తే మతిపోతున్నది. అతను సాధించిన ఘనతలను చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. నా వరకైతే ఇప్పుడున్న క్రికెట్‌ వరల్డ్‌‌లో విరాటే బెస్ట్‌‌ బ్యాట్స్‌ మన్‌ . నేను అతిగాచెప్పడం లేదు. అతని పెర్ఫామెన్స్‌ ను చూస్తే తెలుస్తుంది. కళ్లముందు కనిపిస్తున్న అతని స్టాట్స్‌ ను చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది. సౌతాఫ్రికాలో అన్‌ ఈవెన్‌ వికెట్‌ ఎదురైనా సెంచరీకొట్టాడు. ఫాస్ట్‌‌ బౌలర్లకు భయపడతాడు, బౌన్సీ పిచ్‌ లపైఆడలేడు, స్పిన్నర్లను దీటుగా ఎదుర్కోలేడని ఏ ఒక్కరూ చెప్పలేరు. రకరకాల పిచ్‌ లపై భిన్నమైన బౌలర్ల బౌలింగ్‌ లోపరుగులు సాధించాడు. ఇంతకంటే ఏం కావాలి అతనే బెస్ట్‌‌ అనిచెప్పడానికి’ అని మియాందాద్‌ వ్యాఖ్యానించాడు.విరాట్‌ , రోహిత్‌ … బ్యాటింగ్‌ ను చాలా సులువుగామార్చేశారన్నాడు. క్లీన్‌ హిట్టర్‌ అయిన విరాట్‌ బ్యాటింగ్‌ ను ఎంతసేపు అయినా చూడొచ్చన్నాడు.

Latest Updates