మధ్యలో నాభార్య పేరు ఎందుకు.?

న్యూ ఢిల్లీ: వన్డే వరల్డ్‌‌ కప్‌ సందర్భంగా అనుష్క శర్మకు సెలెక్టర్లు టీ అందించారని మాజీ ప్లేయర్‌ ఫారుక్‌ ఇంజనీర్‌ చేసిన సంచలన ఆరోపణలపై టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ స్పందించాడు. ప్రతి ఒక్కరికి అనుష్క ‘సాఫ్ట్‌ టార్గెట్‌ ’ అయ్యిందని విమర్శించాడు. ఇంజనీర్‌ చేసిన ఆరోపణలు ఆశ్చర్యాన్ని కలిగించాయన్న విరాట్‌ .. ఆమె పేరు చెప్పడం సరైంది కాదని వ్యాఖ్యానించాడు.‘వరల్డ్‌‌ కప్‌ లో లంకతో మ్యాచ్‌ కు మాత్రమే అనుష్క వచ్చిం ది. ఇద్దరు ఫ్రెండ్స్‌‌తో కలిసి ఫ్యామిలీ బాక్స్‌‌లో కూ ర్చొంది. ఆ బాక్స్‌‌లో సెలెక్టర్లు ఎవరూ లేరు. వాళ్ల డిఫరెంట్‌ బాక్స్‌‌లో ఉన్నారు . తన రంగంలో అనుష్క సూపర్‌ సక్సెస్‌‌లో ఉంది. ఏదైనా కామెంట్‌ వస్తే ప్రతి ఒక్కరు గుర్తిస్తారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. సెలెక్టర్లను ఏదైనా అనాలనుకుంటే అనుకోండి. కానీ మధ్యలో ఆమె పేరు ఎందుకు తీసుకురావాలి. అబద్దాలు కాకుండా నిజాలు మాట్లాడితే బాగుంటుంది’ అని కోహ్లీ అన్నాడు.

MORE NEWS:

నిద్రపోవడమే జాబ్.. జీతం లక్ష: ఇండియన్స్ అంతా అప్లై చేసుకోవచ్చు

ఆ నలుగురే కాదు: వీళ్లు ముసుగేసుకున్న మృగాలు

Latest Updates