పని చేయడం జీవన విధానంలో ఓ భాగం: కోహ్లి

ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అద్భుతమైన బ్యాటింగ్, చురుకైన ఫీల్డింగ్ స్కిల్స్ తో ఫ్యాన్స్ ను ఎప్పుడూ మెస్మరైజ్ చేస్తుంటాడు. అయితే కరోనా కారణంగా మ్యాచ్ లు లేకపోవడంతో మిగిలిన స్పోర్ట్స్ తోపాటు క్రికెట్ మ్యాచ్ లూ ఆగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో విరాట్ ఫ్యాన్స్ ను ఉత్సాహపరచడానికి కొత్తగా ప్రయత్నించాడు. ఒక స్ఫూర్తిదాయక పోస్ట్ ను ఇన్ స్టాగ్రామ్ లో పెట్టాడు. ఇందులో విరాట్ తన ఇంటి పైన టెర్రస్ లో వర్కౌట్స్ చేస్తూ హుషారుగా కనిపించాడు.

‘పని చేయడమనేది జీవన విధానంలో ఓ భాగం. అది ప్రొఫెషన్ లో అవసరం కాకపోవచ్చు. దాన్ని ఎంపిక చేసుకోవాలా లేదా అనేది మీ ఇష్టం’ అని క్యాప్షన్ జత చేసి ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. లాక్ డౌన్ లో కోహ్లి అందరితో ఇంటరాక్ట్ అవుతున్నాడు. ఈ మధ్య స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పిల్లలతో ముచ్చటించాడు. ఈ వీడియోలో స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ కూడా పాల్గొన్నాడు. పలు క్రికెటింగ్ విషయాల గురించి వీరు చర్చించారు. ఇందులో భాగంగా కోహ్లి మాట్లాడుతూ.. నా దృష్టిలో చాహల్ పెద్ద జోకర్. ఆ తర్వాత స్థానం బుమ్రాదే అని సరదాగా వ్యాఖ్యానించాడు.

Latest Updates