కోహ్లీ ఖాతాలో సరికొత్త రికార్డు

నిన్న, ఈ రోజు ఏ మ్యాచ్ లేకపోయినా.. కోహ్లీ ఖాతాలో సరికొత్త రికార్డు..
నిన్న, ఈ రోజు ఏ మ్యాచులు జరగలేదు కదా.. మరి కోహ్లీ ఖాతాలో రికార్డేంటి అనుకుంటున్నారా? అవును అది నిజమే.. ఆడిన ప్రతి మ్యాచ్‌లో ఏదో ఒక రికార్డు సృష్టించే పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ ఇప్పుడు మరో రికార్డు సృష్టించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 50 మిలియన్ల ఫాలోవర్లను సాధించి, ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్‌గా రికార్డు సాధించాడు. కోహ్లీని ఇన్‌స్టాలో ఆయన అభిమానులే కాకుండా.. పలువురు సినీ నటులు, రాజకీయ నాయకులు కూడా ఫాలో అవుతున్నారు. ఇప్పటివరకు విరాట్ తన ఇన్‌స్టా ద్వారా 930 పోస్టులను చేశాడు. కోహ్లీ పెట్టిన ఏ పోస్టు అయినా సరే మిలియన్ల వ్యూస్‌ను సాధించింది. ఈ విధంగా 50 మిలియన్ల ఫాలోవర్లతో ఇండియాలో ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా ఎక్కువమంది ఫాలోవర్లను కలిగి ఉన్న వ్యక్తిగా నిలిచాడు. ఆ తర్వాతి ప్లేస్‌లో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా 49.9 మిలియన్ల ఫాలోవర్లతో రెండవ ప్లేస్‌లో ఉండగా.. ఆ తర్వాత 44.1 మిలియన్ల ఫాలోవర్లతో బాలీవుడ్‌కు చెందిన మరో నటి దీపికా పదుకొనే మూడవ ప్లేస్‌లో ఉంది.

ఇక ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. ఇన్‌స్టాగ్రామ్ అధికారిక ఖాతాలో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న వారిలో పోర్చుగల్‌కు చెందిన క్రిస్టియానో ​​రొనాల్డో 200 మిలియన్ల ఫాలోవర్లతో మొదటి స్థానంలో ఉన్నారు.

ప్రస్తుతం కోహ్లీ జట్టు న్యూజిలాండ్‌తో ఫిబ్రవరి 21 నుండి ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ కోసం సన్నద్దమవుతుంది.

Latest Updates