మళ్లీ టాప్ లేపాడు.. స్మిత్ ను వెనక్కి నెట్టిన కోహ్లీ

టీమిండియా కెప్టెన్  వీరాట్ కోహ్లీ టెస్టు ర్యాంకింగ్ లో మళ్లీ నంబర్ వన్ కు  ఎగబాకాడు. ఐసీసీ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన టెస్టు ర్యాంకింగ్స్ లో కోహ్లీ 928 పాయింట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్  స్మిత్ ను వెనక్కి నెట్టి ఫస్ట్ ప్లేస్ దక్కించుకున్నాడు. 923 పాయింట్లతో స్మిత్ రెండో స్థానంలో, 877పాయింట్లతో కేన్ విలియమ్స్ సన్  మూడో స్థానంలో.. 791 పాయింట్లతో నాలుగో స్థానంలో చటేశ్వర పుజారా, ట్రిపుల్ సెంచరీ బాదిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ 764 పాయింట్లతో ఐదో స్థానంలో, 759 పాయింట్లతో ఆరోస్థానంలో అజింక్య రహానే  ఉన్నారు.

టెస్టు బౌలర్లలో పాట్ కుమినస్ 900 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా 794 పాయింట్లతో జస్పిత్ బుమ్రా ఐదో స్థానంలో..772 పాయింట్లతో అశ్విన్ తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఆల్ రౌండర్ లిస్టులో 473 పాయింట్లతో జాసన్ హోల్డర్ అగ్రస్థానంలో ఉండగా .. 406 పాయింట్లతో రెండో స్థానంలో జడేజా ఉన్నాడు.

Latest Updates