ఫోర్బ్స్ఇండియా లిస్టు: కోహ్లీ తర్వాతే సల్మాన్

ఫోర్బ్ ఇండియా సెలబ్రిటీల లిస్టులో క్రికెటర్  విరాట్ కోహ్లీ మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు.బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను కూడా వెనక్కి నెట్టి ఈ ఏడాది ఫస్ట్ ప్లేస్ లో నిలిచాడు.

ఈ ఏడాది సెలబ్రిటీల లిస్టును ఫోర్బ్స్ ఇండియా గురువారం విడుదల చేసింది. ఈ లిస్టులో విరాట్ కోహ్లీ మొదటి స్థానాన్ని సొంతం చేసుకోగా… బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మూడో స్థానానంలో నిలిచారు. రెండో స్థానంలో సినీ నటుడు.. యాక్షన్ కింగ్ అక్షయ్ కుమార్ ఉన్నాడు. గతేడాది రెండో స్థానంలో నిలిచిన విరాట్… ఈసారి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక ధోని ఐదో స్థానంలో కొనసాగగా… సచిన్ టెండూల్కర్ తొమ్మిదో స్థానంలో నిలిచాడు.

Latest Updates