పింక్ బాల్ టెస్టు మ్యాచ్.. మాకు సవాలే

మొదటి డే నైట్ టెస్టు మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నామన్నాడు టీమిండియా కెప్టెన్ వీరాట్ కోహ్లీ. రేపు జరగనున్న డేనైట్ టెస్టు మ్యాచ్ పై కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. పింక్ బాల్ తో జరిగే ఈ మ్యాచ్ ను తాము ఓ ఛాలెంజ్ గా తీసుకుంటున్నట్లు చెప్పాడు. ఈ మ్యాచ్ తమకు మైలురాయి లాంటి మ్యాచ్ అని..నెట్స్ లో చాలా ప్రాక్టీస్ చేశామన్నాడు. ఈ టెస్టు మ్యాచ్ అభిమానులకు వినోదాన్ని పంచుతుందన్నాడు. టీమిండియా అద్భుతంగా రాణిస్తుందని.. ఈ టెస్టును సవాల్ గా తీసుకుని గెలుపుతో ముగిస్తామన్నాడు కోహ్లీ.

అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న డేనైట్ టెస్ట్ మ్యాచ్ కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్ లో 22 న మొదలు కానుంది. భారత్ బంగ్లాతో జరగనున్న ఈ మ్యాచ్ కు పలువురు ప్రముఖ క్రికెటర్లు హాజరుకానున్నారు.

Latest Updates