ICC టీ20 ర్యాంకింగ్స్: రెండో స్థానంలో కేఎల్ రాహుల్, పదో స్థానంలో కోహ్లీ

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సెల్(ICC) ప్రకటించిన వరల్డ్ T20 బ్యాట్స్ మెన్ ర్యాంకుల్లో టీమిండియా బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ రెండో స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ తో జరిగిన ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో 224 పరుగులు చేయడంతో తన ప్లేస్ ను కాపాడుకున్నాడు. మరోవైపు ఆ సిరీస్ లో ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో కలిపి 105 రన్స్ చేసిన విరాట్ కోహ్లీ ప్లేస్ పదో స్థానానికి పడిపోంది. టీమిండియా బ్యాట్స్ మెన్లలో వీరిద్దరితోపాటు రోహిత్ శర్మ 9 స్థానంతో టాప్-10 లో ఉన్నాడు

నాలుగో స్థానంలో టీమిండియా..

దేశాల వారీగా చూస్తే.. 20 ర్యాంకింగ్స్ లో పాకిస్తాన్ టాప్ లో ఉంది. ఆస్ట్రేలియా రెండో ప్లేస్ లో ఉండగా.. ఇంగ్లండ్ కేవలం రెండు పాయింట్ల తేడాతో మూడో స్థానంలో కొనసాగుతోంది. టీమిండియా నాలుగో స్థానంలో, సౌతాఫ్రికా ఐదో స్థానంలో ఉన్నాయి.

Latest Updates