నీర్ దోస మాకు.. మష్రూమ్‌ బిర్యాని మీకు..

ముంబై: కరోనా దెబ్బకు ముంబైలో ఉంటున్న కెప్టె న్‌ విరాట్‌కోహ్లీ తదితరులు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అయితే శ్రేయస్‌ అయ్యర్ బుధవారం కోహ్లీకి తన ఇంటి భోజనం రుచి చూపించాడు. తన తల్లి చేసిన నీర్ దోసలను విరాట్‌ ఇంటికెళ్లి ఇచ్చొచ్చాడు. బదులుగా కోహ్లీ తమ ఇంట్లో చేసిన మష్రూమ్‌ బిర్యానీని అయ్యర్ కు ఇచ్చాడు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోను కోహ్లీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌‌ చేశాడు. ఇందులో ఇద్దరూ ముఖానికి మాస్కులు ధరించి దూరం నిల్చొని ఉన్నారు. ‘మాకు 500 మీటర్లదూరంలో ఉంటున్న ఓ మనసున్న పొరుగింటి వ్యక్తి తమ ఇంట్లో వేసిన దోసలు తెచ్చి మాలో ఆనందం నింపాడు. మీ మామ్‌కు బిగ్‌ థ్యాంక్స్‌. ఎందుకంటే ఇంత రుచి కరమైన దోసలు తిని చాలా కాలమైంది. అలాగే, మేం పంపించిన మష్రూమ్‌ బిర్యానీని ఎంజాయ్‌ చేశావని ఆశిస్తున్నా. గమనిక. ఈ కొత్త ఫొటోలు సోషల్‌ డిస్టె న్సింగ్‌ నార్మ్స్‌ పాటిస్తూ దిగినవి’ అని కోహ్లీ ట్వీట్‌ చేశాడు.

Latest Updates