కలలో కూడా అలా అనుకోను

ఎప్పటికీ ఆర్‌‌‌‌సీబీతోనే

దుబాయ్‌‌‌‌‌‌‌‌: రాయల్స్‌‌‌‌‌‌‌‌ చాలెంజర్స్‌‌‌‌‌‌‌‌ బెంగళూరు(ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ)కి దూరం కావాలని కలలో కూడా అనుకోవట్లేదని ఆ జట్టు కెప్టెన్‌‌‌‌‌‌‌‌ విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ అన్నాడు. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో ఉన్నంత కాలం ఆర్‌‌‌‌‌‌‌‌సీబీతోనే ఉంటానని, జట్టును లీగ్‌‌‌‌‌‌‌‌లో చాంపియన్‌‌‌‌‌‌‌‌గా నిలబెట్టడమే తన లక్ష్యమని చెప్పాడు. 18 ఏళ్ల వయసులో ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ జట్టులో చేరిన కోహ్లీ.. 12 ఏళ్లుగా టీమ్‌‌‌‌‌‌‌‌లో కొనసాగుతున్నాడు. 2011 నుంచి కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు.  బ్యాట్స్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌గా కోహ్లీ ఎంత సక్సెస్‌‌‌‌‌‌‌‌ అయినా సరే జట్టును మాత్రం విజేతగా నిలపలేకపోయాడు. 2009, 2016 సీజన్లను ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ రన్నరప్‌‌‌‌‌‌‌‌గా ముగించింది. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో ఆ జట్టుకు అదే బెస్ట్‌‌‌‌‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌.  రిజల్ట్స్‌‌‌‌‌‌‌‌ సంగతి ఎలా ఉన్నా బెంగళూరు టీమ్‌‌‌‌‌‌‌‌తో విరాట్‌‌‌‌‌‌‌‌కు విడదీయలేని బంధం ఏర్పడింది. ‘  ఆర్‌‌‌‌‌‌‌‌సీబీతో ప్రయాణం మొదలుపెట్టి12 ఏళ్లు అవుతోంది. ఇది నిజంగా అద్భుతం. ఆర్‌‌‌‌‌‌‌‌సీబీకి ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీ అందించడమే జట్టులో నాతోపాటు  చాలామంది లక్ష్యం .  మూడు సార్లు లక్ష్యానికి దగ్గరగా వచ్చాం కానీ అనుకున్నది సాధించలేకపోయాం.  చాంపియన్‌‌‌‌‌‌‌‌గా నిలవడమే జట్టులో అందరి కల. ఇక ఆర్‌‌‌‌‌‌‌‌సీబీని వదిలేయాలని కలలో కూడా అనుకోవట్లేదు. ఫ్రాంచైజీ చూపించే ప్రేమ, తీసుకునే జాగ్రత్త అందుకు ప్రధాన కారణం. లీగ్‌‌‌‌‌‌‌‌లో జట్టు ఉన్న పరిస్థితి, రిజల్ట్స్‌‌‌‌‌‌‌‌తో సంబంధం లేకుండా ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ తమ ప్లేయర్లకు తగిన గౌరవం ఇస్తుంది. అందువల్ల నేను ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో ఆడినన్ని రోజులు ఆర్‌‌‌‌‌‌‌‌సీబీలోనే కొనసాగుతా’ అని విరాట్‌‌‌‌‌‌‌‌ చెప్పుకొచ్చాడు. ఇక, ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ 13 కోసం కోహ్లీ రెడీ అవుతున్నాడు. ఐదు నెలల బ్రేక్‌‌‌‌‌‌‌‌ తర్వాత ప్రాక్టీస్ సెషన్స్‌‌‌‌‌‌‌‌లో పాల్గొంటున్నప్పటికీ మునుపటి ఉత్సాహంతో  కనిపిస్తున్నాడు.

For More News..

కంగన ట్వీట్​తో ముంబై షేక్

సీఎస్కేకు వరుస షాకులు.. రైనా దారిలో భజ్జీ

పాసైనా ఫాయిదా లేకపాయె!

Latest Updates