కోహ్లీ ఓ దురదృష్టవంతుడు : షోయబ్ అక్తర్

వరల్డ్ కప్ తొలి సెమీ ఫైనల్ టీమ్ ఇండియా ఓటమిపై పలువురు స్పందిస్తున్నారు. న్యూజిలాండ్ తో జరిగిన ఈ మ్యాచ్ పై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మాట్లాడుతూ.. కెప్టెన్ విరాట్ కోహ్లీ దురదృష్టవంతుడని అన్నారు. అంపైర్‌ నిర్ణయానికి కోహ్లి బలయ్యాడని అభిప్రాయపడ్డాడు.

బ్యాటింగ్ చేసిన తొలి ఐదుగురు బ్యాట్స్ మెన్ పూర్తిగా నిరాశపరచారని, ఆటతీరులో దారుణంగా విఫలమయ్యారన్నారు. రోహిత్ శర్మ ఓ అద్భుత బంతి ఔటవ్వగా.. కోహ్లీ మాత్రం ఓ తప్పుడు నిర్ణయానికి అవుటయ్యాడని ఆయన తెలిపారు. కోహ్లీ కొట్టిన బాల్.. బెయిల్స్ ను క్లిప్ చేస్తూ వెళ్లిందని అన్నాడు. ఫీల్డ్‌ అంపైర్‌ దానిని ఎల్బీడబ్ల్యూ ఔట్‌గా ప్రకటించడంతో కోహ్లీ పెవిలియన్ బాట పట్టాడన్నారు.  టాపార్డర్ నుంచి లోయర్ ఆర్డర్ వరకు అందరూ సాధారణ బంతులకే వికెట్లు సమర్పించుకున్నారని షోయబ్ విమర్శించాడు. అయితే, ఆ తర్వాత కోలుకుని పోరాడడం మాత్రం అద్భుతమని కితాబిచ్చాడు.

జడేజా, ధోని ఇద్దరూ కూడా విజయంపై ఆశలు రేకెత్తించారని కాని అనుకోకుండా వారిద్దరూ అవుటయ్యారని షోయబ్‌ అక్తర్ అన్నాడు. ఏదేమైనా ప్రపంచకప్‌లో అద్భుత విజయాలు సాధించిన తమ జట్టు ప్రదర్శన పట్ల టీమిండియా అభిమానులు గర్వపడాలి’ అని షోయబ్‌ చెప్పుకొచ్చాడు.

Latest Updates