కొహ్లీతో సహా ఎవరూ బ్రేక్ చేయలేని సచిన్ రికార్డ్

పరుగుల యంత్రంగా  పేరు తెచ్చుకున్న టీమిండియా కెప్టెన్ వీరాట్ కోహ్లీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు.  మూడు ఫార్మాట్లలో కోహ్లీ ఎందరో దిగ్గజాల రికార్డులు బద్దలు కొట్టాడు. క్రికెట్ దేవుడిగా పిలుచుకునే సచిన్ రికార్డులు కూడా ఎన్నో బ్రేక్ చేశాడు కొహ్లీ.కానీ సచిన్ కు సంబంధించిన ఒక రికార్డును కోహ్లీ ఎన్నడూ బ్రేక్ చేయలేడంటూ  మాజీ క్రికెటర్ వీరేంద్ర సేహ్వాగ్ కామెంట్ చేశాడు. సచిన్ ఇప్పటి వరకు 200 టెస్టులు ఆడాడు. ఆ తర్వాత ప్లేసులో రికీ పాంటింగ్(168) టెస్టులు ఆడాడు. కోహ్లీ ఇప్పటి వరకు 77 టెస్టులు ఆడి 6613 రన్స్ చేశాడు. అయితే దీనిపై కామెంట్ చేసిన సెహ్వాగ్ కోహ్లీ బెస్ట్ బ్యాట్స్ మెన్ సచిన్ రికార్డులను దాదాపు బ్రేక్ చేస్తాడు కానీ 200 టెస్టుల రికార్డును కోహ్లీతో సహా ఎవరూ బ్రేక్ చేయకపోవచ్చన్నాడు. ఎందుకంటే 200 టెస్టుల కంటే ఎక్కువ టెస్టులు ఎవరూ ఆడకపోవచ్చు అని సెహ్వాగ్ అన్నాడు.

Latest Updates