సెహ్వాగ్ భార్య ఆర్తి సంతకం ఫోర్జరీ..

టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వగ్ భార్య ఆర్తి తన బిజినెస్ పార్ట్నర్స్  పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.  తమకు తెలియకుండా  తన భర్త పేరును వాడుకోవడమే కాకుండా తన సంతకం  ఫోర్జరీ చేసి బ్యాంకుల నుంచి రూ. 4.5 కోట్ల లోన్ తీసుకున్నారని ఆరోపించారు. లోన్ తీసుకోవడమే కాకుండా వారికి పోస్ట్ డేటెడ్ చెక్కులు  ఇచ్చి డబ్బు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. వారు తీసుకున్న లోన్ కు తమకు ఎటువంటి సంబంధం లేదని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.  ఆర్తి ఫిర్యాదుతో వారిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Latest Updates