వర్చువల్ పార్లమెంటరీ కమిటీ మీటింగ్స్ కు కేంద్రం నో?

న్యూఢిల్లీ: పార్లమెంట్ కమిటీ సమావేశాలను వర్చువల్ మోడ్ లో నిర్వహించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ చేస్తున్న డిమాండ్ ను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించే యోచనలో ఉన్నట్లు సమాచారం. వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించడానికి సెక్యూర్ ప్లాట్ ఫామ్ లేకపోవడాన్ని కేంద్రం కారణంగా చూపుతోందని తెలుస్తోంది. పెద్దగా సురక్షితం కాని ప్లాట్ ఫామ్స్ ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన సున్నితమైన సమాచారం లీక్ అయ్యే ప్రమాదం ఉందని కేంద్రం భావిస్తన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్లమెంటరీ అఫైర్స్ ను చర్చించే విషయాలను రహస్యంగా ఉంచడం చాలా కీలకమన్నది ప్రభుత్వ ఆలోచనగా ఈ వర్గాలు తెలిపాయి. దేశ వ్యాప్తంగా రైళ్లు, విమానయన సేవలు తిరిగి ప్రారంభమవడవంతో పార్లమెంటరీ కమిటీ సమావేశాలు నిర్వహిస్తే వాటికి సభ్యులు హాజరవ్వొచ్చని పేర్కొన్నాయి. జూన్ 1వ తేదీ నుంచి పార్లమెంటరీ మీటింగ్స్ తిరిగి ప్రారంభించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దేశ వ్యాప్త లాక్ డౌన్ కారణంగా ఉభయ సభల మీటింగ్స్ నిలిపేసిన సంగతి తెలిసిందే.

కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ అధ్యక్షతన శుక్రవారం ప్రతిపక్ష పార్టీలు ఆన్ లైన్ మీటింగ్ నిర్వహించాయి. ఈ సమావేశంలో ప్రతిపక్షాలు ఏకతాటిన కరోనా క్రైసిస్ లో ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించట్లేదని విమర్శలకు దిగాయి. కాంగ్రెస్ లీడర్లు జైరాం రమేశ్, శశి థరూర్, అధిర్ రంజన్ చౌధురీతోపాటు బిజూ జనతా దళ్ భర్తరీ మహాతబ్ లాంటి నేతలు వర్చువల్ మీటింగ్స్ నిర్వహించాల్సిందిగా డిమాండ్ చేశారు. కరోనా వ్యాప్తి టైమ్ లో పార్లమెంట్ సమావేశాల నిర్వహణపై లోక్ సభ స్పీకర్ వెంకయ్య నాయుడు, రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు మరోసారి భేటీ కానున్నారు. ఈ అంశంపై వారి మూడో సమావేశం కానుంది.

Latest Updates