గణేశ్ దగ్గర వర్చువల్ పూజలు.. శానిటైజ్డ్‌ పందిళ్లు

  • కరోనా ప్రొటోకాల్ ప్రకారమే గణేశ్ పూజ
  • ముంబైలో తగ్గి పోయిన మండపాల సంఖ్య
  • సోషల్ మీడియాలో లైవ్ పూజల

 

ఏటా ముంబైలోని లాల్ బాగ్ ఏరియా గణేశ్ గల్లీకి వచ్చే ‘ ముంబై చా రాజా’ గణపతికి వేలాది మంది జనం ‘గణపతి బప్పామోరియా’ అంటూ ఘన స్వాగతం పలికేవారు. కానీ ఈ ఏడాది గణేశ్చతుర్ధికి అసలు సందడే లేదు. గణేశోత్సవాల్లో జనమే కనిపించలేదు. మండపాల దగ్గర ఫేస్ మాస్కులు పెట్టుకున్న వలంటీర్లే తప్ప జనం లేరు. పెద్ద పెద్ద మండపాల్లో రోజుకు 400 మంది భక్తులను మాత్రమే అనుమతిస్తున్నారు. కరోనా నేపథ్యంలో భక్తులు ఇండ్ల కే పరిమితం కావాలని సూచిస్తున్న ఆర్గనైజర్లు.. పూజా కార్యక్రమా లను సోషల్మీడియా ప్లాట్ షామా ద్వారా లైవ్ స్ట్రీమిం గ్ చేస్తున్నారు. మండపాల దగ్గర కరోనా ప్రొటోకాల్ పాటిస్తున్నారు. చిన్నచిన్నమండపాల్లోనే కాదు.. వంద ఏండ్లనుంచి ఏర్పాటు చేస్తున్నమండపాలలోనూ ఇదే పరిస్థితి. భక్తుల సేఫ్టీదృష్ట్యా ఈసారి గణేశ్ఉత్సవాల ను సాదాసీదాగానే జరుపుతున్నామని నిర్వా హకులు చెప్పారు. లాల్బగీచా మండపంలో నిర్వా హకులు శనివారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.

తగ్గిన మండపాల సంఖ్య

ముంబైలో కరోనా కేసుల సంఖ్యపెరుగుతూ ఉండటంతో గణేశ్ మండపాల సంఖ్య బాగా తగింది. ఏటా ముంబైలో 3,500 నుంచి 4,000 వరకూ గణేశ్ మండపాల కోసం అప్లికేషన్లు బృహన్ముంబై మున్సి పల్ కార్పొరేషన్(బీఎంసీ)కి వస్తుంటాయి. కానీ ఈ ఏడాది 2,350 మాత్రమే అప్లికేషన్లు రాగా.. వాటిలో 1,820 అప్లికేషన్ల కే బీఎంసీ అనుమతి ఇచ్చింది. అలాగే మండపాలకు సంబంధించి గైడ్లైన్స్ను రిలీజ్ చేసింది. విగ్రహాల హైట్ మండపాల్లో 4 అడుగులు, ఇంట్లో 2 అడుగులకు మించొద్దం ది. పూలు, గజమా లలను బ్యాన్ చేసింది. రోజూ మూడుసార్లుమండపా లను శానిటైజ్ చేయాలని, ఒక మండపంలో ఐదుగు రికంటే ఎక్కువ మంది ఉండొద్దని చెప్పింది.

కరోనా ప్రొటోకాల్ ప్రకారమే..

తాను చూసిన ఉత్సవాల్లోఅతి సాదాసీదాగా జరిగిన వి ఇవేనని లాల్బాగ్ సార్వజనిక్ ఉత్సవల్ మండల్ జాయింట్ ట్రెజరర్ అద్వైత్ పెదాంకర్ చెప్పారు.

Latest Updates