ఒక్కరోజులో 56 మందికి వైరస్.. ఏపీలో 800 దాటిన కేసులు

అమరావతి: ఏపీలో రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 56 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఏపీ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 813కు చేరుకుంది. గుంటూరు జిల్లాలో కరోనా ట్రీట్​మెంట్ పొందుతూ బుధవారం ఇద్దరు చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 24కు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 120 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని, ప్రస్తుతం 669 మంది కరోనాకు ట్రీట్​మెంట్ పొందుతున్నారని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 5,757 మందికి కరోనా టెస్టులు చేశామని, అందులో 5,701 శాంపిల్స్ రిజల్ట్ నెగెటివ్ వచ్చిందని వివరించారు. కర్నూలు, గుంటూరు జిల్లాల్లోనే ఒక్కరోజులో 19 కొత్త కేసులు ఫైల్ అయినట్లు తెలిపారు. రాష్ట్రంలో కర్నూలు జిల్లా 203 కేసులతో మొదటి స్థానంలో ఉండగా.. గుంటూరు 177 కేసులతో రెండో ప్లేస్ లో ఉంది.

Latest Updates