మే3వరకు వీసాల గడువు పెంపు

  • ఉత్తర్వులు జారీ చేసిన హోంశాఖ

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా మన దేశంలోనే ఇరుక్కుపోయి.. వీసా గడువు ముగిసిన ఫారెనర్లు మే 3వరకు మన దేశంలోనే ఉండొచ్చని కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వాళ్ల వీసా గడువును పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇండియాకు రావాల్సిన దౌత్యవేత్తలు, ఐరాస అధికారులు మినహా మిగతా వారికి మే 3వరకు వీసా జారీని నిలిపేసినట్లు చెప్పింది. ఫిబ్రవరి 1 అర్ధరాత్రి నుంచి మే 3 వరకు గడువు ముగిసిన వారు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుంటే ఎలాంటి చార్జ్‌ లేకుండానే గడువు పొడిగిస్తామని అన్నారు. అధికారులతో మాట్లాడిన తర్వాతే ఈ విషయంపై నిర్ణయం తీసుకున్నామని హోంశాఖ చెప్పింది. అవసరమైన వారికి మే 3 తర్వాత 14 రోజులు ఎక్స్‌టెన్షన్‌ ఇస్తామని, ఓవర్‌ ‌స్టే పెనాల్టీ విధించమని అన్నారు. అంతే కాకుండా దౌత్యవేత్తలు, ఐరాస అధికారులు మినహా విదేశీయులకు జారీ చేసిన వీసాలను మే 3 వరకు రద్దు చేయాలని ఆదేశించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించారు. ఫారెన్‌ నుంచి వచ్చే వారి వల్ల కరోనా రావడంతో అధికారులు ట్రావెల్‌ బ్యాన్‌ విధించారు. ఫ్లైట్లన్నీ నిలిపేశారు. దీంతో చాలా మంది ఫారెనర్స్‌ ఇండియాలో ఇరుక్కుపోయారు.

Latest Updates