సైనా నెహ్వాల్​కు వీసా సమస్య

న్యూఢిల్లీ: ఇండియా టాప్‌‌ షట్లర్‌‌ సైనా నెహ్వాల్‌‌కు వీసా సమస్య ఎదురైంది. దాంతో వచ్చే వారం జరిగే డెన్మార్క్‌‌ ఓపెన్‌‌లో ఆమె బరిలోకి దిగడం అనుమానంగా మారింది. ఈ నెల 15న మొదలయ్యే టోర్నీ కోసం డెన్మార్క్‌‌ వెళ్లేందుకు తన వీసా క్లియర్‌‌ చేయాలని సైనా  కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ సాయం కోరింది.  ‘నేను, నా ట్రైనర్‌‌ డెన్మార్క్‌‌ వెళ్లేందుకు వీసా విషయంలో అర్జెంట్‌‌గా మీ సాయం కావాలి.

వచ్చే వారం ఓడెన్స్‌‌లో ఈ టోర్నీ మొదలవుతుంది. కానీ, ఇప్పటిదాకా మాకు వీసాలు అందలేదు. వచ్చే మంగళవారమే మా మ్యాచ్‌‌లు ప్రారంభం అవుతాయి’ అని ట్వీట్‌‌ చేసిన సైనా.. విదేశాంగ మంత్రి  ఎస్‌‌ జైశంకర్‌‌ను ట్యాగ్‌‌ చేసింది.

Latest Updates