మరో 6 సోలార్ రూఫ్ తోపుడు బండ్లు పంపిణీ చేసిన విశాక ఇండస్ట్రీస్

సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆదర్శంగా నిలుస్తోంది విశాక ఇండస్ట్రీస్. చిన్న వ్యాపారులకు సోలార్ రూఫ్ తో తయారు చేసిన తోపుడు బండ్లను  ఉచితంగా పంపిణీ చేస్తోంది. నాలుగు రోజుల క్రితం 12 తోపుడు బండ్లను విశాఖ ఇండస్ట్రీస్ వైస్ చైర్మెన్ వివేక్ వెంకటస్వామి పంపిణీ చేశారు. ఇవాళ మరో 6 తోపుడు బండ్లను పేదలకు అందించారు విశాక ఇండస్ట్రీస్ డైరెక్టర్ జేపీ రావ్.

సుమారు రూ.40 వేల ఖర్చుతో ఒక్కోదాన్ని తయారుచేయించారు. తోపుడు బండి వ్యాపారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనీ… త్వరలోనే మరికొంత మందికి తోపుడు బండ్లు అందిస్తామని చెప్పారు విశాక ఇండస్ట్రీస్ డైరెక్టర్ జేపీ రావ్.

Latest Updates