యూఎన్–హాబిటాట్‌‌లో  విశాఖ ఇండస్ట్రీస్

visaka-industries-jmd-vamsi-krishna-invited-for-1st-un-habitat-kenya
  • కార్యక్రమంలో పాల్గొన్న ఏకైక కంపెనీ
  • ‘సస్టెనబుల్‌‌ హౌజ్‌‌’ నమూనాల ప్రదర్శన

నైరోబి : ప్రపంచవ్యాప్తంగా నగర జీవన నాణ్యతను పెంచడానికి, వనరులను సంరక్షించడానికి ఐక్యరాజ్య సమితి ‘యూఎన్‌‌–హాబిటాట్’ పేరుతో కెన్యా రాజధాని నైరోబీలో నిర్వహించిన తొలి సమావేశంలో విశాఖ ఇండస్ట్రీస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీ కృష్ణ పాల్గొన్నారు. గత నెల 27 నుంచి 31 వరకు నైరోబిలోని యూఎన్‌‌–హాబిటాట్‌‌ ప్రధాన కార్యాలయంలో ఈ అసెంబ్లీ సెషన్ జరిగింది. సుమారు మూడు వేల మంది అంతర్జాతీయ ప్రతినిధులు  సమావేశాలకు వచ్చారు. పట్టణ ప్రజలకు మెరుగైన గృహవసతి అందించేందుకు యూఎన్ -హాబిటాట్‌‌  కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

వీనెక్ట్స్‌‌ సూట్‌‌ పేరుతో విశాఖ ఇండస్ట్రీస్‌‌ అంతర్జాతీయస్థాయి ప్రొడక్టులను అందిస్తోంది. తాజాగా ఆటమ్ పేరుతో ఎలక్ట్రిక్ రూఫ్‌‌ను విడుదల చేసింది. గృహ వసతి వంటి సమస్యలను పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన సమావేశం కాబట్టి ఈ రంగానికి సేవలు అందిస్తున్న కంపెనీగా ఇందులో పాల్గొనడం కీలకమని వంశీ అన్నారు.  కార్యక్రమానికి వివిధ దేశాల ప్రతినిధులు హాజరయ్యాయినందున  తమ అభిప్రాయాలను వినిపించడానికి, ప్రొడక్ట్స్‌‌ను ప్రదర్శించడానికి సరైన వేదిక అని అన్నారు. యూఎన్–హాబిటాట్‌‌లో పాలుపంచుకున్న ఏకైక ఇండియన్ కంపెనీ తమదే కావడం గర్వకారణమని పేర్కొన్నారు. తమ ఎకో ఫ్రెండ్లీ, సస్టెనబుల్‌‌ హౌజ్‌‌ల నమూనాలను సమావేశ ప్రతినిధులకు చూపించినట్టు చెప్పారు.

‘హౌజింగ్ ఫర్ ఆల్’ అనే అంశంపై జరిగిన అత్యున్నతస్థాయి చర్చల్లోనూ వంశీ పాల్గొన్నారు. బార్సిలోనాకు చెందిన డిజైన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నీడ్‌‌ల్యాబ్‌‌తో తాము భాగస్వామ్యం  కుదుర్చుకున్నామని, పూర్తిగా పర్యావరణ అనుకూల ఇళ్లను అందిస్తామని పేర్కొన్నారు. ఈ హౌజ్‌‌లను ఆటమ్ ఎలక్ట్రిక్ రూఫ్, వీ బోర్డు, వీ ప్యానల్స్‌‌తో రూపొందిస్తున్నామని చెప్పారు. ఆటమ్‌‌ రూఫ్‌‌తో ఇంటికి అవసరమైన సౌర విద్యుత్‌‌ను ఉత్పత్తి చేయవచ్చు.

Latest Updates