విశాఖలో ఆన్ లైన్ మోసాలు… నైజీరియన్ ముఠా అరెస్ట్

ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్ ముఠాను పట్టుకున్నారు విశాఖ పోలీసులు. ఆన్ లైన్ చారిటీ డొనేషన్ పేరిట టోకరా పెడుతున్న ముఠాను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. తనకున్న 39 కోట్ల డబ్బును దానం చేస్తున్నట్లు ఓ మహిళ నుంచి విశాఖకు చెందిన సంజయ్ సింగ్ కు మెయిల్ వచ్చింది. మెయిల్ ను నమ్మి రిప్లై ఇచ్చిన సంజయ్ సింగ్ కు.. ఆ మహిళ మాయ మాటలు చెప్పింది. మనీ ట్రాన్స్ ఫర్ చేయాలంటే కస్టమ్ డ్యూటీ, ఇన్సూరెన్స్, ఆర్బీఐ చార్జెస్ చెల్లించాలనడంతో.. పలుసార్లు వివిధ బ్యాంక్ అకౌంట్స్ లో 6 లక్షలు 62 వేలు వేశాడు సంజయ్ సింగ్. ఎంతకూ డబ్బు రాకపోవడంతో మోసపోయానని గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న నలుగురు నైజీరియన్స్, మేఘాలయకు చెందిన ఒక మహిళను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 2 లాప్ టాప్ లు, 6 మొబైల్ ఫోన్స్,  55 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ అకౌంట్స్ లో ఉన్న మరో లక్షన్నర రూపాయలను ఫ్రీజ్ చేయించారు.

మరిన్ని వార్తలు…
లంచం ఇవ్వలేదని చెప్పుతో కొట్టిన మహిళా ఆఫీసర్
CAA వ్యతిరేక నిరసన కారులపై కాల్పులు.. ఇద్దరు మృతి
సీఏఏ నిరసనల్లో పాక్ ఏజెంట్లు
ప్రపంచం అంతానికి ఇంకా 100 సెకన్లే!
నీళ్లకు ఎక్స్‌‌పైరీ డేట్‌‌ ఉందా?
మోడల్ స్కూల్​ అడ్మిషన్ల​ షెడ్యూల్ విడుదల

Latest Updates