విశాఖ నుంచి ముంబై లేట్ నైట్ ఫ్లైట్స్: టైమింగ్స్ ఇవే

విశాఖపట్నం నుంచి ముంబైకు లేట్ నైట్ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇందుకు ఎయిర్ ఇండియా ముందుకు వచ్చిందని తెలిపింది ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్. 2018జనవరిలో కేంద్ర మాజీ మంత్రి పూరందీశ్వరితో కలిసి ఎటీఏ… ఎయిర్ ఇండియాను సంప్రదించింది. దీంతో 2019 మే నుంచి ఈ రూట్ లో లేట్ నైట్ విమానాలను నడుపడానికి అంగీకరించింది ఎయిర్ ఇండియా. అయితే రెండు నగరాల మధ్య తిరగనున్న లేట్ నైట్ ఫ్లైట్ టైమింగ్స్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

 సోమవారం నుంచి శుక్రవారం వరకు
Mumbai to Visakhapatnam 7PM  ->  8.50 PM

Visakhapatnam to Mumbai 9.30 PM -> 11.20 PM

శని, ఆదివారాల్లో
Mumbai to Visakhapatnam 9.10PM   ->  11.00

Visakhapatnam to Mumbai 11.30 PM -> 1.20 AM

వీటితో పాటే.. ఢిల్లీ-విశాఖ మధ్య కూడా లేట్‌నైట్‌ విమానాలను నడపడానికి ఎయిర్‌ ఇండియా హామీ ఇచ్చిందని ఏటీఏ ప్రతినిధులు తెలిపారు.

Latest Updates