‘యాక్షన్’ లవర్స్ కోసం .. విశాల్ – తమన్నా స్టంట్స్

విశాల్ – తమన్నా కాంబినేషన్ లో వస్తోన్న ‘యాక్షన్’ మూవీ టీజర్ విడుదలైంది. హై యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ రూపొందిందని మూవీ మేకర్స్ అంటున్నారు.

టీజర్ లోని స్టంట్స్, ఫైట్ సీక్వెన్సులు… యాక్షన్ లవర్స్ ను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఫారిన్ లొకేషన్లలో మూవీని భారీ స్థాయిలో తీశారు. విశాల్, తమన్నా కలిసి చేసిన స్టంట్స్… ఏక్ థా టైగర్, టైగర్ జిందాహై స్టైల్లో అలరించేలా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. తమిళంలో తొలిసారి నటిస్తున్న మలయాళీ నటి, ఫిలింఫేర్ అవార్డ్ విన్నర్ ఐశ్వర్య లక్ష్మి గ్లామర్ కళ్లు జిగేల్మనిపించేలా ఉంది. యోగిబాబు, పూరి ఆకాంక్ష, కబీర్ దుహన్ సింగ్, రాంకీ ముఖ్య పాత్రలు పోషించారు.

హిప్ హాప్ తమిళ సంగీతం అందించిన యాక్షన్ మూవీకి సుందర్.సి దర్శకుడు. త్వరలోనే ఈ మూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Latest Updates