హిట్ మూవీ రివ్యూ

రన్ టైమ్: 2 గంటల 10 నిమిషాలు

నటీనటులు: విశ్వక్ సేన్, రుహాని శర్మ, మురళీ శర్మ, హరితేజ తదితరులు

మ్యూజిక్ : వివేక్ సాగర్

నిర్మాత: నాని,ప్రశాంతి త్రిపురనేని

రచన,దర్శకత్వం: శైలేష్ కొలను

రిలీజ్ డేట్: ఫిబ్రవరి 28,2020

కథేంటి?

క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అయిన విక్రమ్ (విశ్వక్ సేన్) ఓ పాత ఇన్సిడెంట్ తో సైకలాజికల్ గా డిస్ట్రబ్ అవుతుంటాడు.అందరి సలహా మేరకు 6 నెలలు లీవ్ పెట్టి రెస్ట్ తీసుకుంటున్న సమయంలో తన గర్ల్ ఫ్రెండ్ నేహా (రుహాని శర్మ) మిస్సింగ్ అయినట్టు తెలుస్తుంది. షాక్ గురైన విక్రమ్ కు ఆ కేస్ ఇవ్వకుండా ఇంకోమ్మాయి ప్రీతి మిస్సింగ్ కేస్ ఇస్తారు. రెండు కేసులకు లింక్ ఉండటంతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత తనకు ఎలాంటి నిజాలు తెలిసాయి..నేహా,ప్రీతిలను ఎవరు కిడ్నాప్ చేసారు.వాళ్లు బతికారా లేదా అనేది కథ.

ఎవరెలా చేశారు?

విశ్వక్ సేన్ బాగా పర్ఫార్మ్ చేశాడు. యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ రోల్ కు బాగా సరిపోయాడు.రుహాని శర్మ జస్ట్ ఓకే. ఫ్రెండ్ రోల్ చేసిన యాక్టర్ బాగా చేశాడు. హరితేజ, భానుచందర్, మురళీ శర్మ, బ్రహ్మాజీ అందరూ బాగా చేశారు.

టెక్నికల్ వర్క్:

సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. వివేక్ సాగర్ మ్యూజిక్ బెగ్గెస్ట్ అస్సెట్. పాటలు లేకున్నా..తన అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో బాగా ఎలివేట్ చేశాడు. ఎడిటింగ్ బాగుంది. ఆర్ట్ వర్క్, డీటెయిలింగ్ కూడా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి.

విశ్లేషణ:

‘‘హిట్’’ మేజర్ పార్ట్ వరకు గ్రిప్పింగ్ గా సాగే ఓ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా. క్లైమాక్స్ వరకు పట్టు సడలకుండా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. అయితే క్లైమాక్స్ అంతగా ఆకట్టుకోదు.అక్కడ చూపించిన రీజన్ కూడా ఎఫెక్టివ్ గా లేదు. దీంతో ఏదో వెలితి ఉంటుంది. కానీ ఉన్నంతలో బాగానే ఎంగేజ్ చేసాడు డైరెక్టర్ శైలేష్. కొత్తవాడే అయిన టైట్ స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. సినిమా మొదలైనప్పటినుంచి సీరియస్ గా కథలోకి తీసుకెళ్లాడు. ఫస్టాఫ్ అక్కడక్కడా ఆకట్టుకునే సీన్లు రాసుకున్నాడు. సెకండాఫ్ మొదలైనప్పటి నుండి బాగా నడిపించాడు. కేస్ స్టడీ చేసిన విధానం బాగుంది. కాకపోతే కొన్ని లాజిక్ లు వదిలేయడం,హీరో ఫ్లాష్ బ్యాక్ గురించి సరైన డీటెయిలింగ్ ఇవ్వకపోవడం మైనస్. అది నెక్స్ట్ పార్ట్ లో ఇస్తామని చెప్పారు. కానీ ఇందులోనే చూపిస్తే ఎమోషనల్ కనెక్ట్ ఎక్కువుండేది. ఇక అప్పటివరకు సీరియస్ నడిపించిన డైరెక్టర్ క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ మాత్రం పేలవంగా ఉంది.అది కన్వీన్సింగ్ గా లేదు. దీంతో సినిమా మీద ఇంప్రెషన్ పోతుంది. ఓవరాల్ గా ఇలాంటి థ్రిల్లర్ మూవీస్ ను ఇష్టపడేవారికి నచ్చుతుంది.

Latest Updates