కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా విశ్వేశ్వర హెగ్డే

బీజేపీ సీనియర్  ఎమ్మెల్యే విశ్వేశ్వర హెగ్డే కాగేరి కర్ణాటక అసెంబ్లీ కొత్త స్పీకర్‌గా ఎన్నికయ్యారు. కాగేరి ఒక్కరే నామినేషన్‌ వేయడంతో స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది. అసెంబ్లీలో తగిన సంఖ్యాబలం లేకపోవడంతో స్పీకర్‌ పదవికి కాంగ్రెస్‌, జేడీఎస్‌లు పోటీ చేయలేదు. కొత్త స్పీకర్‌ ఎన్నిక ప్రక్రియను బుధవారం అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌ కృష్ణారెడ్డి నిర్వహించారు. స్పీకర్‌ ఎన్నికయ్యాక ఆయన కూడా తన పదవికి రాజీనామా చేశారు.

కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణంలోని కుమారస్వామి ప్రభుత్వం మెజారిటీ లేక విశ్వాసపరీక్షలో ఓడిపోవడంతో బీజేపీ పక్ష నేత యడియూరప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన రమేష్ కుమార్ స్పీకర్ పదవికి వెంటనే రాజీనామా చేశారు.

 

Latest Updates