ఆ ‘జూ’ లో సింహంతో ఆడుకోవచ్చు

Visitors Can Play With Declawing Lion Cub at palestine zoo

Visitors Can Play With Declawing Lion Cub at palestine zoo‘జూ’కు ఎందుకెళ్తాం? పులులు, సింహాలు, ఏనుగులు, అడవి జంతువులను చూడటానికి.. కానీ వాటితో ఆడుకునే చాన్స్‌‌‌‌‌‌‌‌ కూడా ఇస్తే? పాలస్తీనాలోని గాజా దక్షిణాన ఉన్న రఫాజూ ఇదే అవకాశాన్ని ఇస్తోంది. ఓ 14 నెలల సింహంతో ఆడుకోమంటోంది.

ఆ ఆడ సింహం పేరు ఫాలెస్టయిన్‌. మనుషులను చూస్తే భయపడకుండా ఉండేలా దానికి ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ కూడా ఇచ్చారు. దాని పంజా గోళ్లూ తీసేశారనుకోండి.. కానీ పళ్లున్నాయండోయ్‌‌‌‌‌‌‌‌.

Visitors Can Play With Declawing Lion Cub at palestine zooసింహాన్ని రెండు వారాలుగా పెంచుతున్న ఫయేజ్‌‌‌‌‌‌‌‌ అల్‌‌‌‌‌‌‌‌ హడ్డాడ్‌‌‌‌‌‌‌‌.. ఓ రోజు బోనులోంచి దాన్ని బయటకు తీసి స్థానికుల దగ్గరకు తీసుకెళ్లాడు. అలా అలా దాన్ని మనుషులకు అలవాటు చేశాడు. మనుషుల దగ్గర ఉన్నప్పుడు ప్రమాదం జరగకుండా దాని పంజా
గోళ్లను తీసేశామని చెప్పాడు.

Visitors Can Play With Declawing Lion Cub at palestine zoo6 నెలల్లో పంజా గోళ్లు పెరుగుతాయన్నడు హడ్డాడ్‌‌‌‌‌‌‌‌.. సింహం తన ప్రమాదకర ప్రవర్తను ఎప్పుడూ కోల్పోదన్నాడు. జూలో మూడు పిల్లలు సహా 5 సింహాలున్నాయి . కానీ, పంజా గోళ్లను తీసేయడంపై ఎన్జీవోలు మండిపడుతున్నాయి.

Visitors Can Play With Declawing Lion Cub at palestine zoo

Latest Updates