నా తండ్రి బాగానే ఉన్నాడు: వివాన్ షా క్లారిటీ

బాలీవుడ్ లో గొప్ప న‌టుడిగా గుర్తింపు పొందిన న‌సీరుద్దీన్ షా(70) అనారోగ్యంతో హాస్పిట‌ల్ లో చేరిన‌ట్లు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన ఆయ‌న కొడుకు వివాన్ షా .. ఆ వార్త‌ల్లో నిజం లేద‌న్నాడు. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా తెలిపిన వివాన్ షా.. నా తండ్రి హాస్పిట‌ల్ పాలయ్యారని చెక్కర్లు కొడుతున్న వార్తల్లో నిజం లేదు. దయచేసి అలాంటి వాటిని నమ్మొద్దు. అతను బాగానే ఉన్నారు. ఇర్ఫాన్ భాయ్, చింటూజీల కోసం ప్రార్థనలు చేస్తున్నాం. వారిని బాగా మిస్ అవుతున్నాం. వారు లేని లోటు పూడ్చలేనిది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం” అని ట్వీట్ చేశాడు వివాన్ షా.

నసీరుద్దీన్ షా హిందీ చిత్రసీమలో గొప్ప నటుడిగా, డైరెక్టర్‌గా గుర్తింపు పొందారు. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించి, 1980 దశకంలో తన హవా కొనసాగించారు. అలాంటి దిగ్గజ నటుడు అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరారనే వార్త చూసి బాలీవుడ్ లోకం ఉలిక్కిపడింది. దీంతో ఆయన ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఇది గమనించిన నసీరుద్దీన్ షా తనయుడు వివాన్ షా వెంటనే స్పందిస్తూ అలాంటి వార్తలు ఫేక్ అని క్లారిటీ ఇచ్చాడు.

Latest Updates