కాళేశ్వరం పూర్తయితే తెలంగాణ దశ మారిపోతుంది

ఉస్మానియా యూనివర్సిటీలో సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ 39వ వార్షిక సదస్సు ముగింపు వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా ఉన్నత విద్యామండలి చైర్మన్  పాపి రెడ్డి తోపాటు.. ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి, ఉస్మానియా యూనివర్సిటీ ఓఎస్ డి వైస్ ఛాన్సలర్, యూఎస్ఏ షానీ స్టేట్ యూనివర్సిటీ లావణ్య వెంసాని పాల్గొన్నారు.

వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ”సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ లో తెలంగాణ చరిత్రపై పరిశోధన పత్రాలను ప్రవేశపెట్టడం సంతోషంగా ఉంది. తెలంగాణ యాస, భాషపై ఇంతకు ముందు ఉన్న చులకన భావం మారింది. తెలంగాణ చరిత్ర వెలికి తీసేందుకు ఓయూ హిస్టరీ విభాగం కృషి చేయాలి. దానికి అవసరం అయిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేలా చేస్తాను. నిజాం కాలంలో అమలు అయిన రెవిన్యూ టాక్స్ విధానం చాలా రాష్ట్రాలకు మార్గసూచికం అయ్యింది. సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరం పూర్తి అయితే తెలంగాణ రైతుల దశ దిశ మారిపోతుంది. 1956 లో చారిత్రక వైరుధ్యాలు ఉన్నప్పటికి రెండు తెలుగు రాష్ట్రాలను అప్పటి పాలకులు కలిపారు” అని అన్నారు.

“సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ ను నిర్వహించిన ఓయూ హిస్టరీ విభాగానికి అభినందనలు తెలిపారు పాపిరెడ్డి. సోషల్ లైఫ్ లొ హిస్టరీకి ప్రముఖ స్థానం ఉందనీ… గతం, వర్తమానం, భవిష్యత్ కు హిస్టరీ వారధి లాంటిదని చెప్పారు.

Latest Updates